మొదటిసారిగా ఇంటర్నెట్ అప్‌లోడ్, డౌన్‌లోడ్ స్పీడ్‌లో జియో అగ్రస్థానం!

by Seetharam |
మొదటిసారిగా ఇంటర్నెట్ అప్‌లోడ్, డౌన్‌లోడ్ స్పీడ్‌లో జియో అగ్రస్థానం!
X

న్యూఢిల్లీ: ఇంటర్నెట్‌ స్పీడ్ విషయంలో టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, జియో తన వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించిన దాదాపు ఆరేళ్ల కాలంలో మొదటిసారిగా డౌన్‌లోడ్, అప్‌లోడ్ 4జీ ఇంటెర్నెట్ స్పీడ్‌లో అగ్రస్థానాన్ని సాధించింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి జియో 4జీ నెట్‌వర్ అప్‌లోడ్ స్పీడ్ సెకనుకు 6.4 ఎంబీపీఎస్ స్పీడ్‌తో టాప్‌లో ఉంది.

దీని తర్వాత వొడాఫోన్, ఐడియా 5.9 ఎంబీపీఎస్ అప్‌లోడ్ వేగంతో ఇంటరెంట్‌ను అందించింది. అంతకుముందు ఆగష్టులో వొడాఫోన్, ఐడియా 6.7 ఎంబీపీఎస్‌తో అగ్రస్థానంలో ఉంది. గత కొన్ని త్రైమాసికాలుగా వొడాఫోన్ ఐడియా అప్‌లోడ్ స్పీడ్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లు సెప్టెంబర్‌లో 3.4 ఎంబీపీఎస్ అప్‌లోడ్ స్పీడ్‌ని నమోదు చేశాయి.

ఇక, 4జీ డౌన్‌లోడ్ విభాగంలో జియో తన లీడర్‌షిప్‌ని కొనసాగించింది. సమీక్షించిన నెలలో జియో 19.1 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌ని ఇవ్వగా, దీని తర్వాత ఎయిర్‌టెల్ 14 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్ అందించింది. వొడాఫోన్ ఐడియా 12.7 ఎంబీపీఎస్, బీఇఎస్ఎన్ఎల్ 5 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌ని అందించింది.

Advertisement

Next Story