- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణ వ్యాప్తంగా Jio 5G సేవలు
by Harish |

X
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో 5G సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొంది. మొత్తంగా ఇప్పటి వరకు 850 కి పైగా ప్రాంతాల్లో ట్రూ 5G సేవలు లభిస్తున్నాయని కంపెనీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పర్యాటక ప్రదేశాలు, విద్యాసంస్థలు, మాల్స్, మార్కెట్లు, హాస్పిటల్స్, నివాస సముదాయాలు, ప్రభుత్వ భవనాలు, వాణిజ్య సంస్థలు, ఎంపిక చేసిన గ్రామాలు, నగరాలల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ విషయంపై తెలంగాణ జియో సీఈఓ కేసీ రెడ్డి మాట్లాడుతూ, 2023 డిసెంబర్ నాటికి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామం, పట్టణాల్లో ట్రూ 5G సేవలు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని అన్నారు.
Next Story