ఇజ్రాయెల్-ఇరాన్: టెల్ అవీవ్‌కు నెలఖరు వరకు ఎయిర్‌ ఇండియా విమానాలు రద్దు

by Disha Web Desk 17 |
ఇజ్రాయెల్-ఇరాన్: టెల్ అవీవ్‌కు నెలఖరు వరకు ఎయిర్‌ ఇండియా విమానాలు రద్దు
X

దిశ, బిజినెస్ బ్యూరో: మిడిల్‌ఈస్ట్‌లో ఘర్షణలు మరింత తీవ్రమైన నేపథ్యంలో ఇప్పటికే చాలా విమానాలు రద్దు కాగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. అయితే భారత్‌కు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కూడా ఉద్రిక్తతల కారణంగా ఇజ్రయెల్‌లోని మెట్రోపాలిటన్ ప్రాంతంలో అత్యధిక జనాభా కలిగిన టెల్ అవీవ్‌కు 2024 ఏప్రిల్ 30 వరకు తన విమాన సర్వీసులను నిలిపివేసినట్లు శుక్రవారం ప్రకటించింది. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో, టెల్ అవీవ్‌కు వెళ్లడానికి ఇప్పటికే టిక్కెట్లు బుకింగ్ చేసుకున్న వారు రీషెడ్యూలింగ్ చేసుకోవాలని, క్యాన్సిలేషన్ చార్జీలపై కూడా ఒక్కసారి మినహాయింపు ఉంటుందని పేర్కొంది.

మిడిల్‌ఈస్ట్‌లో ప్రస్తుతం పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. గగనతలం గందరగోళంగా ఉంది, దీంతో విమానాలను రద్దు చేయాలని నిర్ణయించాము. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఎక్స్‌లో విమాన సంస్థ వ్యాఖ్యానించింది. ప్రయాణికుల కోసం 24/7 అందుబాటులో ఉండే కాల్ సెంటర్‌ నెంబర్లను సైతం విడుదల చేసింది, అవి: 011-69329333 / 011-69329999. ఎయిర్ ఇండియా తన కస్టమర్‌లు, సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందని తెలిపింది. అంతకుముందు కూడా ఏప్రిల్ 14 న, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా విమానయాన సంస్థ టెల్ అవీవ్‌కు విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది

Next Story

Most Viewed