- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రెడిట్ కార్డు బిల్లు గడువు దాటిందా.. ఆందోళన అవసరం లేదంటున్న ఆర్‌బీఐ
దిశ, వెబ్‌డెస్క్: క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఆర్‌బీఐ శుభవార్త తీసుకొచ్చింది. వ్యక్తిగత కారణాల వలన ఎవరైనా క్రెడిట్ కార్డు బిల్లు కట్టడం ఆలస్యం అయితే ఇక మీదట ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు గడువు దాటిపోయినా కూడా అదనంగా మూడు రోజుల వరకు ఎలాంటి అదనపు భారం ఉండదని ఆర్‌బీఐ తెలిపింది.
దీని వలన వినియోగదారులు ఇకమీదట క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు గడువు దాటిన తర్వాత అదనంగా మూడు రోజుల వరకు బిల్లు చెల్లించడానికి టైం ఉంటుంది. అప్పుడు కూడా బకాయిలు చెల్లించక పోతే అదనపు ఛార్జీలు విధిస్తారు.
ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, క్రెడిట్ కార్డు జారీ చేసే సంస్థలు.. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు క్రెడిట్ బకాయిల గురించి సమాచారం తెలియజేయాలి. బకాయిలు చెల్లించడానికి గడువు తేదీ దాటిన తర్వాత మూడు రోజుల వరకు కూడా ఎలాంటి చార్జీలు కానీ, అదనపు వడ్డీని గాని విధించడానికి వీలు లేదు.
గడువు దాటిన మూడు రోజుల లోపు వినియోగదారులు బకాయిలు చెల్లించవచ్చు. ఒకవేళ మూడు రోజుల గడువు దాటిన తర్వాత బిల్లు చెల్లిస్తే గనుక లేట్ ఫీజును స్టేట్‌మెంట్‌లో ఉన్న గడువు తేదీ నుంచి లెక్కిస్తారు. ఈ ఛార్జీలు మొత్తం అమౌంట్(బాకీ) మీద కాకుండా అవుట్ స్టాండింగ్ అమౌంట్ మీద మాత్రమే వేయాలని ఆర్‌బీఐ పేర్కొంది.
ఇవి కూడా చదవండి: