అన్ని బీమా పాలసీలు ఒకే గొడుకు కిందికి.. బీమా సుగం ఏర్పాటుకు ఆమోదం

by Harish |   ( Updated:2024-03-23 10:15:25.0  )
అన్ని బీమా పాలసీలు ఒకే గొడుకు కిందికి.. బీమా సుగం ఏర్పాటుకు ఆమోదం
X

దిశ, బిజినెస్ బ్యూరో: బీమా సంస్థలు, మధ్యవర్తులు, ఏజెంట్‌లు, వాటాదారులతో సహ ఇతర బీమారంగ సమస్యలు, సలహాలు, పాలసీలను కొనుగోలు చేయడం, విక్రయించడం, ఫిర్యాదులు, క్లెయిమ్‌లను పరిష్కరించడం మొదలగు వాటన్నింటిని ఒకే గొడుగు కిందికి తీసుకురావడానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ఇటీవల ‘బీమా సుగం’ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీనిలో బీమా రంగానికి చెందిన అంశాలు ఉంటాయి. తద్వారా బీమాకు సంబంధించిన పారదర్శకత, సామర్థ్యం, సహకారాన్ని ప్రోత్సహించినట్లవుతుందని IRDAI ప్రకటన తెలిపింది.

ఇన్సూరెన్స్ ఎలక్ట్రానిక్ మార్కెట్‌ప్లేస్ రెగ్యులేషన్స్- బీమా సుగమ్, ద్వారా డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌లో 2047 నాటికి పాలసీలను విశ్వవ్యాప్తం చేయడంతో పాటు పాలసీదారుల ప్రయోజనాలను బలోపేతం చేయడం, పరిరక్షించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు అన్నారు. బీమా రంగానికి సంబంధించిన రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ నుంచి వచ్చిన నిబంధనల ఆధారంగా దీని ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

ఏజెంట్లు, బ్రోకర్లు వంటి సాంప్రదాయ మార్గాల ద్వారా బీమా పాలసీలను కొనుగోలు చేయడం, ఫారమ్‌లను నింపడం వంటివి ప్రస్తుతం జరుగుతుండగా, బీమా సుగమ్ ద్వారా వీటన్నింటిని ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లోకి మారుస్తారు. పేపర్‌వర్క్‌ను తొలగించడం వలన పాలసీదారులతో పాటు ఏజెంట్లకు పని చాలా సులభం అవుతుంది. బీమా సుగమ్‌తో, కస్టమర్‌లు ఇకపై లైఫ్, హెల్త్, నాన్-లైఫ్ ఇన్సూరెన్స్‌లను ఒకే అప్లికేషన్‌లో చూడవచ్చు.

Advertisement

Next Story