- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫుడ్ డెలివరీ కోసం Swiggyతో జతకట్టిన IRCTC
దిశ, బిజినెస్ బ్యూరో: రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ Swiggyతో ఒప్పందం కుదుర్చుకుంది. ఐర్‌సీటీసీ ఈ-క్యాటరింగ్ పోర్టల్ ద్వారా ముందస్తుగా భోజనాలు ఆర్డర్ చేసిన వారికి సరైన సమయానికి డెలివరీ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సదుపాయాన్ని ముందుగా నాలుగు రైల్వే స్టేషన్లలో ప్రారంభించనున్నారు. ఈ జాబితాలో భువనేశ్వర్, విజయవాడ, బెంగళూరు, విశాఖపట్నం రైల్వే స్టేషన్లు ఉన్నాయి.
ఈ డీల్ గురించిన వివరాలను IRCTC స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ సదుపాయం ఎంపిక చేసిన నాలుగు స్టేషన్లలో అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. ఇంతకుముందు రైల్వే ప్రయాణికులు ముందుగా ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలను అందించేందుకు ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోతో ఐర్‌సీటీసీ ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే, రైల్లో ప్రయాణిస్తూనే వాట్సాప్ ద్వారా నచ్చిన ఆహారపదార్థాలను ఆర్డర్ చేసుకునే సదుపాయాన్ని కూడా ఐర్‌సీటీసీ తీసుకొచ్చింది.