iPhone: త్వరలోనే ఇండియాలో మరో నాలుగు కొత్త ఐఫోన్ స్టోర్లు..!

by Maddikunta Saikiran |
iPhone: త్వరలోనే ఇండియాలో మరో నాలుగు కొత్త ఐఫోన్ స్టోర్లు..!
X

దిశ, వెబ్ డెస్క్: భారతదేశంలో కొన్ని నెలలుగా ఐఫోన్ల అమ్మకాలు(iPhones Sales) జోరు అందుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే యాపిల్ ఐఫోన్ల ఎగుమతుల్లో మన దేశం రికార్డు సృష్టించింది. ఈ ఫైనాన్సియల్ ఇయర్(Financial year)లో ఇండియా నుంచి ఏకంగా రూ. 50,000 కోట్ల విలువైన ఐఫోన్లు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్(India)లో మరో నాలుగు కొత్త ఐఫోన్ల స్టోర్లు(iPhone stores) ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కంపెనీ సీఈఓ టిమ్ కుక్(CEO Tim Cook) తెలిపారు. రెండో త్రైమాసిక(Q2FY25) ఫలితాల వెల్లడి సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ క్వార్టర్(Quarter)లో కంపెనీ 6 శాతం వృద్ధితో 7.98 లక్షల కోట్ల నికర లాభాన్ని నమోదు చేసిందని, గతేడాది ఇదే సమయంలో కంపెనీ లాభం 7.52 లక్షల కోట్లుగా ఉందని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఆదాయాన్ని నమోదు చేశామని, ఇండియాలో కూడా భారీగా లాభాలను ఆర్జించామని వెల్లడించారు. ఇదివరకే భారత్ లో రెండు స్టోర్లు ప్రారంభించాం. రాబోయే రోజుల్లో మరో నాలుగు కొత్త ఐఫోన్ అవుట్ లెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని కుక్ తెలిపారు.

Advertisement

Next Story