New Year లో మంచి రాబడి కోసం ఈ పథకాల్లో Investments పెట్టండి!

by Harish |   ( Updated:2023-01-02 15:27:06.0  )
New Year లో మంచి రాబడి కోసం ఈ పథకాల్లో Investments పెట్టండి!
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త ఏడాదిలో రాబోయే ఖర్చులను ముందస్తుగా అంచనా వేసుకుని డబ్బులు ఒక ప్రణాళిక బద్దంగా సేవింగ్స్ చేయడం చాలా ఉత్తమం. దీని వలన అనవసర ఖర్చులను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా కొత్త ఏడాదిలో అడుగుపెట్టిన మొదట్లోనే ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. డబ్బులు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే రాబడి ఎక్కువగా ఉంటుంది. తదితర వివరాలు తెలుసుకోవాలి. దీని వలన పిల్లల విద్య, వివాహం, ఆరోగ్యం మొదలగు ఖర్చులకు ఆర్థిక భరోసా దొరుకుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజలకు డబ్బులను పొదుపు చేసుకోవడానికి వివిధ రకాలైన పథకాలను తీసుకొచ్చింది. అందులో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): ఇది కేంద్ర ప్రభుత్వం అందించే అత్యుత్తమైన దీర్ఘకాలిక పొదుపు పథకం. దీనిలో స్థిరమైన వడ్డీ రేటు ఉంటుంది. ప్రస్తుతం సంవత్సరానికి 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. PPFలో పెట్టుబడి పెట్టిన డబ్బులకు ఆదాయపు పన్ను చట్టం లోని సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీనిలో కనిష్ట పెట్టుబడి వ్యవధి 15 సంవత్సరాలు. దేశవ్యాప్తంగా చాలా సంస్థలు తమ ఉద్యోగులకు మెరుగైన ప్రయోజనాలను కొంత అమౌంట్‌ను దీనిలో ఇన్వెస్ట్ చేస్తాయి.

సుకన్య సమృద్ధి యోజన (SSY): ఇది ముఖ్యంగా ఆడ పిల్లల కోసం తీసుకొచ్చిన ఉత్తమం పథకం. ఆడపిల్లల విద్య, వివాహం కోసం రూపొందించారు. ఇది సంవత్సరానికి 7.6 శాతం అధిక వడ్డీ రేటును అందిస్తుంది. SSY ఆదాయపు పన్ను చట్టం లోని సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలు కూడా కలిగి ఉంది.. దీనిలో చేరడానికి దగ్గరలోని పోస్టాఫీసు లేదా బ్యాంకులను సంప్రదించగలరు.

సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ (SCSS): ఇది ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్ కోసం రూపొందించబడిన పొదుపు పథకం. కనీసం ఐదు సంవత్సరాల పెట్టుబడి పెట్టాలి. సంవత్సరానికి 7.4 శాతం స్థిర వడ్డీ రేటు వస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారు దీనిలో పెట్టుబడి పెట్టడం ద్వారా రిటైర్మెంట్ తర్వాత భవిష్యత్తు ఖర్చులకు బాగా ఉపయోగపడుతాయి. అంతేకాకుండా 60 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత అనారోగ్య ఖర్చులకు, పిల్లల పెళ్లిలకు ఉపయోగపడుతుంది.

ఇవే కాకుండా ప్రస్తుతం చాలా రకాల పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ద్వారా కూడా మంచి రాబడి పొందవచ్చు. బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థల కంటే పోస్ట్ ఆఫీస్‌లో ఎక్కువ వడ్డీ రేటు ఉంటుంది. అలాగే, రానున్న బడ్జెట్‌లో వివిధ పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు మారే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి :

New Year ని ఘనంగా ప్రారంభించిన Stock Markets !

Post Office Schemes: 14లక్షలు మీ సొంతం.. ఆ పథకంలో మీరు ఉన్నారా.?

Post Office super hit Scheme: కేవలం రూ.5 వేల పెట్టుబడితో సొంతంగా వ్యాపారం.

Advertisement

Next Story

Most Viewed