- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'ఆయుష్మాన్ భారత్' బీమా రూ. 10 లక్షల పెంచే అవకాశాలు
దిశ, బిజినెస్ బ్యూరో: ఎన్నికల ఏడాది కావడంతో ఫిబ్రవరి 1న వెలువడే మధ్యంతర బడ్జెట్‌లో కేంద్రం 'ఆయుష్మాన్ భారత్' పథకం కింద ప్రస్తుతం ఇస్తున్న ఆరోగ్య బీమా రూ.5 లక్షల మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. కేన్సర్, అవయవ మార్పిడి లాంటి తీవ్రమైన వ్యాధులకు అయ్యే ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఈ అంశంపై సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. అవయవ మార్పిడి, అధిక ఖర్చుతో కూడిన కేన్సర్ చికిత్సలకు రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. వాటిని కూడా ఆయుష్మాన్ భారత్ పథకం కింద కవర్ చేయడంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తొంది. అలాగే, ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన(ఏబీ పీఎం-జేఏవై) కింద లబ్దిదారులను రెట్టింపు చేసి 100 కోట్లకు చేర్చాలని కేంద్రం లక్ష్యంగా ఉంది. అంతేకాకుండా మరో మూడేళ్లలో కిసాన్ సమ్మాన్ నిధి, భవన నిర్మాణ రంగ కార్మికులు, నాన్ కోల్‌మైన్ వర్కర్స్, ఆశా వర్కర్స్‌కు కూడా ఈ పథకం ప్రయోజనాలను విస్తరించాలని భావిస్తోంది. 2023-24లో కేంద్రం ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ. 7,200 కోట్లను కేటాయించింది. ఈ ఏప్రిల్ నుంచి మొదలయ్యే 2024-25కి దీన్ని రూ. 15,000 కోట్లతో రెట్టింపు కేటాయించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.