- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2025 నాటికి రూ. 3 లక్షల కోట్లకు బీమా పరిశ్రమ ప్రీమియం ఆదాయం!
by Harish |
X
న్యూఢిల్లీ: దేశీయ బీమా పరిశ్రమ 2025 నాటికి దాదాపు రూ. 3 లక్షల కోట్ల నికర ప్రత్యక్ష ప్రీమియం ఆదాయాన్ని ఆర్జిస్తుందని ఒక నివేదిక తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి పరిశ్రమ ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం రూ. 2.4 లక్షల కోట్లుగా ఉంటుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తన నివేదికలో వెల్లడించింది. కరోనా మహమ్మారి పరిణామాల తర్వాత దేశీయ బీమా పరిశ్రమ ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభించడంతో పరిశ్రమ ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం 2022-23లో 17.2 శాతం పెరిగి రూ. 2.4 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రజల్లో ఆరోగ్య బీమా పట్ల అవగాహన పెరగడం వల్ల గత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ మొత్తం ఆదాయంలో ఆరోగ్య బీమా ఆదాయం అత్యంత వేగంగా వృద్ధి చెందింది. అలాగే, కరోనా లాక్‌డౌన్ వల్ల నెమ్మదించిన మోటార్ బీమా విభాగం ఆదాయం కూడా ఇటీవల వేగవంతమైందని నివేదిక పేర్కొంది.
Advertisement
Next Story