- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Insurance Industry: బీమా పరిశ్రమలో వేగంగా పెరుగుతున్న ఏఐ పెట్టుబడులు
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా బీమా పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. బీమా తీసుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్ కంపెనీలు కొత్త టెక్నాలజీపై ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. కస్టమర్లు, ఉద్యోగులు, డిస్ట్రిబ్యూటర్లకు ఆన్‌లైన్ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఆధునిక క్లౌడ్ ఆర్కిటెక్చర్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. అలాగే, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ)తో పాటు కొత్త టెక్నాలజీతో పాటు సంబంధిత టెక్ వ్యయాన్ని పెంచాలని బీమా కంపెనీలు నిర్ణయించాయి. ప్రస్తుతం పరిశ్రమ డేటా ప్రకారం.. బీమా పరిశ్రమలో ఐటీ సంబంధిత ఖర్చులు దాదాపు 10 శాతంగా ఉన్నాయి. గడిచిన ఐదేళ్లలోనే పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్లను తీర్చేందుకు బీమా కంపెనీలు ఐటీ వ్యయాన్ని పెంచాయి. ఇటీవల ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లను అప్‌గ్రేడ్ చేయడం, క్లెయిమ్‌ల ప్రక్రియ, కస్టమర్ సర్వీస్ ఆటోమేషన్‌ల కోసం ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఖర్చులను పెంచుతున్నాయి. ఈ ఐదేళ్లలోనే ఐటీ ఖర్చులు 10 శాతం నుంచి 15 శాతానికి పెరిగాయని పరిశ్రమ నిపుణులు వెల్లడించారు.