- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Infosys: 2,000 మంది ఆన్‌బోర్డింగ్ ఆలస్యంపై ఇన్ఫోసిస్ సీఈఓ వివరణ
దిశ, బిజినెస్ బ్యూరో: 2022 బ్యాచ్‌లో సుమారు 2,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు సంబంధించి ఆన్‌బోర్డింగ్ ఆలస్యం కావడంపై టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ స్పందించారు. ఈ వ్యవహారంలో అనేక విమర్శలు, కార్మిక శాఖలో ఫిర్యాదులు నమోదవడంతో ఆయన వివరణ ఇచ్చారు. తేదీలలో కొన్ని మార్పులు ఉన్నప్పటికీ ఆఫర్ చేసిన అందరికీ కంపెనీ ఆన్‌బోర్డ్ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ' ఇచ్చిన ప్రతి ఆఫర్ కంపెనీ పరిధిలోనే ఉంది. ప్రతి ఒక్కరినీ కంపెనీలో చేర్చుకుంటాం. ఏవైనా కారణాలతో తేదీలు మారే అవకాశం ఉంది. కానీ అందరినీ ఉద్యోగంలోకి తీసుకుంటామని హామీ ఇస్తున్నామని ' పరేఖ్ వివరించారు. 2022-23 ఏడాది రిక్రూట్‌మెంట్‌లో ఇన్ఫోసిస్ 2 వేల మందిని పలు విభాగాల్లో ఉద్యోగాలకు ఎంపిక చేసింది. వారందరికీ ఆఫర్ లెటర్లు కూడా ఇచ్చింది. అయితే, వీరంతా 2022 ఏప్రిల్‌లోనే ఉద్యోగంలోకి చేరాల్సి ఉండగా ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చింది. దీనిపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. కాగా, 2024, జూన్ ఆటికి ఇన్ఫోసిస్‌లో మొత్తం 3.15 లక్షల మంది ఉద్యోగులున్నారు.