30 ఎయిర్‌బస్ విమానాలను ఆర్డర్ చేసిన ఇండిగో

by Disha Web Desk 17 |
30 ఎయిర్‌బస్ విమానాలను ఆర్డర్ చేసిన ఇండిగో
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో తన నెట్‌వర్క్ పరిధిని మరింత విస్తరించడానికి కొత్తగా 30 ఎయిర్‌బస్ A350-900 విమానాల కోసం ఆర్డర్ చేసింది. ఈ విషయాన్ని కంపెనీ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ డీల్ విలువ దాదాపు $9 బిలియన్లు అని సమాచారం. ప్రపంచ విమానయాన సంస్థలో ప్రముఖంగా ఉండటానికి ఈ డీల్ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. విమానాల డెలివరీలు 2027 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే, అదనంగా 70 ఎయిర్‌బస్ A350 ఎయిర్‌క్రాఫ్ట్ కొనుగోలు హక్కులు కూడా ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విమాన రోల్స్ రాయిస్ ట్రెంట్ XWB ఇంజిన్‌తో పనిచేస్తుంది.

భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్‌లో ప్రముఖంగా ఉంది. ప్రయాణికుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా భారతీయ నగరాలను కనెక్ట్ చేయడానికి కొత్త విమానాలను ఆర్డర్ చేసినట్టు ఇండిగో పేర్కొంది. ప్రస్తుతం విమానయాన సంస్థ 350 విమానాలను నడుపుతుంది. వాటిలో ఎక్కువ భాగం A320, A321 కుటుంబానికి చెందినవి. ఇవి కాకుండా, ఎయిర్‌లైన్ ప్రాంతీయ దేశీయ మార్గాలలో టర్బో ప్రాప్‌లను కూడా నిర్వహిస్తుంది. గత ఏడాది, జూన్ 2023లో, ఇండిగో ఎయిర్‌బస్‌తో 500 విమానాల కోసం ఆర్డర్ చేసింది. 2023లో, ఇండిగో 100 మిలియన్ల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చింది.



Next Story

Most Viewed