- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
GST Collection: సెప్టెంబర్‌లో రూ. 1.73 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం
దిశ, బిజినెస్ బ్యూరో: భారత వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు మరోసారి అత్యధికంగా నమోదయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రూ. 1.73 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం రాగా, గతేడాది కంటే ఈ మొత్తం 6.5 శాతం అధికమని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. గతేడాది ఇదే నెలలో ప్రభుత్వానికి జీఎస్టీ ద్వారా రూ. 1.63 లక్షల కోట్లు వచ్చాయి. ఈ ఏడాది ఆగష్టులో రూ. 1.75 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. దేశీయ కార్యకలాపాల నుంచి వచ్చిన మొత్తం 5.9 శాతం పెరిగి, సుమారు రూ. 1.27 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో దిగుమతులపై పన్నుల ద్వారా ఆదాయం 8 శాతం వృద్ధితో రూ. 45,390 కోట్లు వచ్చాయి. గత నెలలో ప్రభుత్వం రూ. 20,458 కోట్ల రీఫండ్లు జారీ చేసింది. 2024లో ఇప్పటివరకు జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి రూ. 9.13 లక్షల కోట్లు వచ్చాయి. ఇది గతేడాది కంటే 10.1 శాతం అధికం కావడం గమనార్హం. 2023లో ఇదే తొమ్మిది నెలల కాలంలో రూ. 8.29 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చినట్టు ప్రభుత్వ డేటా పేర్కొంది.