- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
GDP Growth: తొలి త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి 6.7 శాతం
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి 6.7 శాతం వృద్ధి చెందినట్టు శుక్రవారం ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో వృద్ధి 8.2 శాతంగా ఉంది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల కారణంగా ప్రభుత్వ వ్యయం తక్కువగా ఉండటంతో గడిచిన ఐదు త్రైమాసికాల్లోనే తక్కువగా ఈసారి జీడీపీ నెమ్మదించింది. శుక్రవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఏప్రిల్-జూన్‌లో వాస్తవ లేదా స్థిర ధరల వద్ద జీడీపీ రూ. 43.64 లక్షల కోట్లుగా ఉన్నట్టు అంచనా. 2023-24 తొలి త్రైమాసికంలో రూ. 40.91 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 6.7 శాతం అధికమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో భారత వాస్తవ జీడీపీ 8.2 శాతంగా ఉంది. సమీక్షించిన కాలంలో ప్రైవేట్ వినియోగ వ్యయం 7.4 శాతం పెరిగింది. తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి అంచనాల కంటే తక్కువగా ఉన్నప్పటికీ వ్యవసాయేతర వృద్ధి పెరగడం మూలంగా వాస్తవ జీడీపీ స్థిరంగా ఉందని కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ ఉపాసనా భరద్వాజ్ పేర్కొన్నారు. ప్రభుత్వ మూలధన వ్యయం తగ్గినప్పటికీ ప్రైవేట్ రంగంలో పెరిగిన నిధులు, ముఖ్యంగా స్థిరాస్తి రంగంలో పెట్టుబడి ఎక్కువగా ఉందని కేర్ రేటింగ్స్ చీఫ్ ఎకనమిస్ట్ రజనీ సిన్హా వెల్లడించారు.