Union Budget: ఆర్థిక లోటు, మూలధన వ్యయాన్ని సమతుల్యం చేసేలా కేంద్ర బడ్జెట్: ఫిచ్

by S Gopi |
Union Budget: ఆర్థిక లోటు, మూలధన వ్యయాన్ని సమతుల్యం చేసేలా కేంద్ర బడ్జెట్: ఫిచ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ప్రభుత్వం ఇటీవలే సమగ్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ప్రధాని మోడీ 3.0 మిత్రపక్షాలతో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, సంకీర్ణ ప్రభుత్వంపై డిమాండ్లు అనేకం ఉన్నప్పటికీ ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడు ఆర్థిక లోటును తగ్గించేందుకు అవసరమైన చర్యలు బడ్జెట్‌లో కనిపించాయని ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ అభిప్రాయపడింది. అదే సమయంలో అధిక మూలధన వ్యయం ద్వారా కీలకమైన అభివృద్ధి రంగాల్లో కేటాయింపులతో ఆర్థిక వృద్ధికి మద్దతివ్వడాన్ని బడ్జెట్ సూచిస్తోందని తెలిపింది. మంగళవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన బడ్జెట్‌లో ప్రభుత్వం ఆర్థిక లోటు లక్ష్యాన్ని జీడీపీలో 4.9 శాతానికి తగ్గింది. ఇది ఫిబ్రవరి మధ్యంతర బడ్జెట్‌లో 5.1 శాతం కంటే తక్కువే. ఇది జనవరిలో ఫిచ్ అంచనా 5.4 శాతం కంటే గణనీయమైన తగ్గుదల కావడం గమనార్హం. '2024-25లో 10.5 శాతం నామమాత్రపు జీడీపీ వృద్ధిని ప్రకటించడం తమ అంచనా కంటే తక్కువగా ఉన్నందున ఆర్థిక లోటును ప్రభుత్వం తగ్గించగలదని భావిస్తున్నామని' ఫిట్ రేటింగ్స్ పేర్కొంది. అంతేకాకుండా ప్రభుత్వం ఆర్‌బీఐ డివిడెండ్‌ను వినియోగించడం వలన అదనపు వ్యయం కంటే ప్రభుత్వం ఆర్థిక పటిష్టత దిశగా పయనిస్తోందనే తమ అవగాహనను బలపరుస్తోంది. అయితే, తాజా బడ్జెట్ మిడ్-టర్మ్‌లో సాధించే లక్ష్యాలపై పెద్దగా స్పష్టత ఇవ్వలేదు, కానీ రుణాలను తగ్గించే క్రమంలో లోటు సమస్యను పరిష్కరించే ధోరణిలో బడ్జెట్ కనిపిస్తోందని ఫిచ్ వెల్లడించింది.



Next Story