వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6 శాతం!

by Mahesh |
వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6 శాతం!
X

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ 6 శాతం వృద్ధి రేటును సాధించగలదని, ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ద్వారా ఇది సాధ్యమవుతుందని నీతి ఆయోగ్ మాజీ వైస్-చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. ఆదివారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ప్రపంచవ్యాప్తంగా అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ 2023-24 లో 6 శాతం వృద్ధికి అవకాశం ఉంది. ఎగుమతులకు మద్దతు ఇవ్వడం, ఇదే సమయంలో దేశీయ, విదేశీ పెట్టుబడులు మెరుగుపడే చర్యల ద్వారా అనుకున్న వృద్ధి సాధించవచ్చని రాజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

ఆర్‌బీఐ వచ్చే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటును 6.4 శాతంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇదే సమయంలో చైనాతో పెరుగుతున్న భారత వాణిజ్య లోటు కు సంబంధించి అక్కడి మార్కెట్ అవకాశాలను, ప్రయోజనాలను పెంచే ప్రణాళిక కలిగి ఉన్నామని, కొన్ని ఉత్పత్తులు భారత్ నుంచి చైనాకు ఎగుమతులను పెంచే వీలుందని, తద్వారా చైనా నుంచి దిగుమతులను పరిమితం చేయడం భారత్‌కు సాధ్యమవుతుందని రాజీవ్ కుమార్ వివరించారు.

Advertisement

Next Story

Most Viewed