E Commerce Market: రూ. 29.3 లక్షల కోట్లకు భారత ఈ-కామర్స్ మార్కెట్

by S Gopi |
E Commerce Market: రూ. 29.3 లక్షల కోట్లకు భారత ఈ-కామర్స్ మార్కెట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ఈ-కామర్స్ మార్కెట్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. వినియోగదారులకు సంబంధించి కీలకలైన రిటైల్, ఎఫ్ఎంసీజీ రంగాల కంటే ఎక్కువ ఫాస్ట్‌గా ఈ-కామర్స్ దూసుకెళ్తోంది. సోమవారం ప్రముఖ పరిశోధనా సంస్థ డెలాయిట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారతీయ ఈ-కామర్స్ మార్కెట్ 21 శాతం వార్షిక వృద్ధి రేటుతో పెరుగుతోంది. ఇదే స్థాయిలో కొనసాగితే 2030 నాటికి ఈ మార్కెట్ 325 బిలియన్ డాలర్ల(రూ. 29.3 లక్షల కోట్ల)కు చేరుతుందని అంచనా. ఈ-కామర్స్‌తో పోలిస్తే రిటైల్ రంగం 8 శాతం, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) 10 శాతం వృద్ధి రేటును చూడగలవని నివేదిక అభిప్రాయపడింది. సంపన్న కుటుంబాలతో పాటు మధ్యతరగతిలోనూ ఆదాయాలు పెరగడం, వారి సహకారంతో ఈ-కామర్స్ రంగానికి 32 శాతం నుంచి 48 శాతం పెరుగుతుందని అంచనా. సంపన్నుల కుటుంబాలు ఎక్కువ పరిమాణంలో, ప్రీమియం వస్తువులకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. వారు కాకుండా మిగిలిన వర్గాలు చిన్న, బ్రాండ్ కాని, ఇతర తక్కువ ధరలో లభించే ఉత్పత్తులను ఎంచుకుంటున్నారని నివేదిక వెల్లడించింది.

Advertisement

Next Story