- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. నాలుగన్నర లక్షల కోట్లకు భారత సెమీకండక్టర్ల మార్కెట్!
న్యూఢిల్లీ: దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌ల దగ్గరి నుంచి వేరబుల్ పరికరాల వరకు, కంప్యూటర్ల నుంచి డేటా స్టోరేజ్‌ల వరకు అన్ని రకాల ఉత్పత్తులకు భారీ గిరాకీ ఉంది. ఈ నేపథ్యంలో భారత సెమీకండక్టర్ మార్కెట్ 2026 నాటికి రూ. 4.55 లక్షల కోట్లతో గణనీయమైన వృద్ధిని సాధించనుందని డెలాయిట్ నివేదిక తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న డిమాండ్‌కు తోడు దేశీయంగా ప్రభుత్వం పీఎల్ఐ, డీఎల్ఐ వంటి పథకాల ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్న తరుణంలో ఈ వృద్ధి సాధ్యమని నివేదిక అభిప్రాయపడింది.
ఇదే స్థాయి వృద్ధిని కొనసాగించడం వల్ల సెమీకండక్టర్ల గ్లోబల్ మార్కెట్లో భారత్ కీలక పాత్ర పోషించడంతో పాటు 2030 నాటికి రూ. 7 లక్షల కోట్లను అధిగమిస్తుంది. గత రెండేళ్లుగా సెమీకండక్టర్ల కొరత పరిశ్రమలో డిమాండ్ పెరుగుదలకు కారణమైంది. దాంతో పాటు భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఒరిజినల్ పరికరాల తయారీదారుల నుంచి గిరాకీ, ఇతర పరిణామాల నేపథ్యంలో భారత్‌కు అవకాశాలను పెంచింది. ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి లభిస్తున్న మద్దతు సెమీకండక్టర్ల తయారీ కేంద్రంగా మారేందుకు వీలవుతుందని డెలాయిట్ ఇండియా పార్ట్‌నర్ పిఎన్ సుదర్శన్ అన్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 5జీ అందుబాటులోకి రావడం వంటివి సెమీకండక్టర వేగవంతమైన వృద్ధికి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.