- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వామ్మో విదేశీ టూర్ల కోసం భారతీయులు ఇన్ని కోట్లు ఖర్చు చేశారా..!
by Harish |
X
ముంబై: గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య కాలంలో భారతీయులు విదేశీ టూర్ల కోసం సుమారు రూ. 1.02 లక్షల కోట్లను ఖర్చు చేశారని ఆర్‌బీఐ తాజా డేటాలో తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 104 శాతం పెరగడం గమనార్హం. 2021-22లో భారతీయులు విదేశాల్లో ఖర్చు చేసిన మొత్తం విలువ రూ. 50,240 కోట్లుగా ఉంది.
కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021 లలో అంతర్జాతీయ ప్రయాణాలకు ఆంక్షలు ఉన్నాయి. దానివల్ల చాలామంది ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. గత ఏడాది నుంచి ఆంక్షలు తొలగించడంతో ఎక్కువమంది విదేశీ ప్రయాణాలు చేశారు. ఇక, ఈ ఏడాది ఫిబ్రవరిలో విదేశీ ప్రయాణాల కోసం మనవాళ్లు రూ. 8,770 కోట్లను వెచ్చించగా, ఇది 2022, ఫిబ్రవరి కంటే 9.2 శాతం ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. నెలవారీగా చూస్తే జనవరి కంటే 28 శాతం తగ్గిందని ఆర్‌బీఐ డేటా పేర్కొంది.
Advertisement
Next Story