- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వ్యాపారాలకు నిధుల వివక్షను ఎదుర్కొన్న భారత మహిళలు: నివేదిక
దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో మహిళా వ్యవస్థాపకులు తమ వ్యాపారాలకు నిధులు సమకూర్చడంలో పురుషులతో పోలిస్తే స్పష్టమైన వివక్షను ఎదుర్కొన్నారని ఒక నివేదిక పేర్కొంది. గ్లోబల్-డైవర్సిటీ-ఫోకస్డ్ నెట్‌వర్క్ ఎన్‌క్యూబే నివేదిక ప్రకారం, జూన్ 2023- ఫిబ్రవరి 2024 మధ్య స్టార్టప్‌లను ఏర్పాటు చేయడానికి నిధుల కోసం 799 ఒప్పందాలు జరిగాయి. వీటి మొత్తం విలువు $6,646 మిలియన్లు కాగా, వీటిలో మహిళల ఆధ్వర్యంలోని స్టార్టప్‌లకు డీల్స్ 163 మాత్రమే ఉన్నాయి. మొత్తం ఫండింగ్‌లో మహిళా వ్యవస్థాపకులకు చెందిన సంస్థలు 4.5 శాతంతో $300 మిలియన్ల నిధులను సేకరించాయి.
గత కొంత కాలంగా మహిళలు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తుండటంతో తమ కంపెనీలకు మూలధనాన్ని సమీకరించాలని చూస్తున్న మహిళల సంఖ్య భారీగా పెరిగింది. ఈ సంవత్సరం జనవరిలో, కనీసం ఒక మహిళ నేతృత్వంలోని వెంచర్‌లు $74 మిలియన్లను సేకరించాయని నివేదిక పేర్కొంది. పురుషులతో పోలిస్తే భారతీయ మహిళలు సకాలంలో రుణాల చెల్లింపులు చేస్తున్నారని అధ్యయనం తెలిపింది. అలాగే, 86 శాతం శ్రామిక మహిళలు ఆర్థిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలని ఆసక్తిగా ఉన్నారని సర్వే వెల్లడించింది.