- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
IRCTC: డబ్బు లేకపోయినా టికెట్.. ఐఆర్‌సీటీసీ 'బై నౌ-పే లేటర్' సదుపాయం
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రయాణీకుల కోసం భారతీయ రైల్వే సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ఎక్కడికైనా ప్రయాణించాలని ప్లాన్ చేసినప్పటికీ, బుకింగ్ సమయంలో టికెట్ కోసం తగినంత డబ్బు లేకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. సులభంగా టికెట్లను బుక్ చేసుకునేందుకు 'బుక్ నౌ-పే లేటర్' స్కీమ్‌ను ప్రారంభించింది. డబ్బు లేకపోయినప్పటికీ టికెట్లను బుక్ చేసే వెసులుబాటును ఈ స్కీమ్ అందిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా టికెట్లను బుక్ చేసుకున్న తర్వాత 14 రోజుల్లోగా ఆ మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. ఈ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్ ద్వారానే చేసుకోవాలి. దీనికోసం ఐఆర్‌సీటీసీ అకౌంట్‌తో లాగ్-ఇన్ అవ్వాల్సి ఉంటుంది. 'బుక్ నౌ' ఆప్షన్‌ను ఎంచుకున్న తర్వాత ప్రయాణించే వ్యక్తి వివరాలను, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది, అందులో వివరాలు పొందుపరిచిన తర్వాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. పేమెంట్ పేజీలో క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు భీమ్ యాప్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు చేసే ఆప్షన్ వస్తుంది. పే లేటర్ సదుపాయం కోసం ఈపేలేటర్ ప్లాట్‌ఫామ్‌లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత చెల్లింపులకు 'పే లేటర్ ' ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకున్న తర్వాత డబ్బులు చెల్లించకుండానే టికెట్‌ను ఖరారు చేసుకోవచ్చు. 14 రోజుల తర్వాత డబ్బు చెల్లించవచ్చు. ఒకవేళ సమయానికి చెల్లించకపోతే 3.5 శాతం సర్వీస్ ఛార్జీ కట్టాల్సి ఉంటుంది.