- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PC Market: రెండో త్రైమాసికంలో 33.9 లక్షల కంప్యూటర్ పరికరాల ఎగుమతులు
దిశ, బిజినెస్ బ్యూరో: భారత పర్సనల్ కంప్యూటర్(పీసీ) మార్కెట్ ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో మొత్తం 33.9 లక్షల యూనిట్ల విలువైన పరికరాలను ఎగుమతి చేసినట్టు ప్రముఖ ఐడీసీ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. ఇవి గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 7.1 శాతం అధికం. ఈ ఎగుమతుల్లో డెస్క్‌టాప్‌లు, నోట్‌బుక్‌లు, వర్క్ స్టేషన్‌లతో సహా వివిధ ఉత్పత్తులు ఉన్నాయి. తొలి త్రైమాసికంలో నాలుగో స్థానంలో ఉన్న లెనోవో ఈసారి డెల్, ఏసర్ బ్రాండ్లను అధిగమించి రెండో అతిపెద్ద పీసీ తయారీ కంపెనీగా అవతరించింది. లెనోవో కంపెనీ రెండో త్రైమాసికంలో వినియోగదారుల విభాగంలో 32.7 శాతం, వాణిజ్య విభాగంలో 6.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. 'స్కూళ్లు, కాలేజీలు ప్రారంభించడం, ఆన్‌లైన్ విక్రయాల్లో డిమాండ్ కొనసాగడం, దేశ స్వాతంత్ర్య దినోత్సవానికి అవసరమైన నిల్వను విక్రేతలు ఆర్డర్ చేయడం వంటి అంశాలు ఎగుమతుల పెరుగుదలకు కారణమయ్యామని ఐడీసీ ఇండియా, దక్షిణాసియా రీసెర్చ్ మేనేజర్ భరత్ షెనాయ్ చెప్పారు. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) కారణంగా మూడో త్రైమాసికంలో వాణిజ్య విభాగంలో మరిన్ని ఆర్డర్లు ఉంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.