- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
IOB: ఆధార్-ఓటీపీతో అకౌంట్ ఓపెన్ సౌకర్యాన్ని ప్రారంభించిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తన 89వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సేవలను ప్రారంభించింది. వ్యక్తిగత, కార్పొరేట్ కస్టమర్లకు సరళంగా బ్యాంకింగ్ సేవలు అందించేందుకు ఆధార్-ఓటీపీ ఆధారిత ఖాతా ఓపెనింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చినట్టు బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఖాతాదారులు బ్యాంకు వెబ్‌సైట్ ద్వారా సేవింగ్స్ ఖాతాను సులభంగా తెరిచేందుకు ఈ సదుపాయం వీలు కల్పిస్తుంది. డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ ఆర్‌బీఐ ఆహార్ ఓటీపీ ఆధారిత ఈకేవైసీ మార్గదర్శకాలను కట్టుబడి ఉంటాయని, సురక్షితంగా, అవాంతరాలు లేని సేవలను అందిస్తామని బ్యాంకు అధికారిక ప్రకటనలో తెలిపింది. తక్కువ డాక్యుమెంటేషన్‌తో, నిబంధనల ప్రకారం లావాదేవీ పరిమితులకు లోబడి కస్టమర్లు తక్కువ సమయంలో అకౌంట్ ఓపెన్ చేయవచ్చని వెల్లడించింది. ఇదే సమయంలో కార్పొరేట్ బ్యాంకింగ్ పెరుగుతున్న ఆటోమేషన్ అవసరాలకు అనుగుణంగా బ్యాంకు అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్(ఏపీఐ) బ్యాంకింగ్ సేవలను కూడా ప్రారంభించింది. ఈ విధానంలో కార్పొరేట్ కస్టమర్లు తమ అకౌంటింగ్ సిస్టమ్‌ల నుంచి నేరుగా రియల్ టైమ్ లావాదేవీలను, ఇంట్రా బ్యాంక్ బదిలీలను చేయవచ్చని బ్యాంకు వివరించింది. ఏపీఐ బ్యాంకింగ్‌తో లావాదేవీల్లో సురక్షితమైన గేట్‌వే పేమెంట్ జరుగుతుందని పేర్కొంది. కీలక మైలురాయిని అధిగమించిన నేపథ్యంలో తమ కస్టమర్లకు సురక్షితమైన, మెరుగైన బ్యాంకింగ్ సేవలందించాలని భావిస్తున్నామని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సీఈఓ అజయ్ కుమార్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.