RBI: భారత ఆర్థిక వ్యవస్థ చేతిలో మెరుగైన అవకాశాలు: ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా

by S Gopi |   ( Updated:2024-12-30 14:59:05.0  )
RBI: భారత ఆర్థిక వ్యవస్థ చేతిలో మెరుగైన అవకాశాలు: ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గవర్నర్ సంజయ్ మల్హోత్రా తొలిసారిగా మాట్లాడారు. దేశ ఆర్థికవ్యవస్థ ఇటీవల కొంత నెమ్మదించినప్పటికీ, వృద్ధికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో దేశీయంగా వినియోగం, వ్యాపారం విశ్వాసం మెరుగుపడుతుందని ఆయన అంచనా వేశారు. ఇదే సమయంలో 2025 ఏడాదికి సంబంధించి వృద్ధి అవకాశాలపై ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానంగా దేశంలో పెట్టుబడులు అత్యంత సానుకూలంగా ఉన్నాయని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఆర్థిక కార్యకలాపాలు తగ్గిన తర్వాత, ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిణామాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదని సోమవారం విడుదల ఆర్‌బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదికలో ఆయన పేర్కొన్నారు. ఆర్‌బీఐ ముఖ్యంగా ఆర్థిక సంస్థల స్థిరత్వాన్ని కొనసాగించడం, ఆర్థికవ్యవస్థ వృద్ధికి కావాల్సిన అంశాలపై దృష్టి సారిస్తుందని చెప్పారు. భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా ప్రజల విశ్వాసం కొనసాగేందుకు టెక్నాలజీ ఆధారిత, కస్టమర్ సెంట్రిక్ నిర్ణయాలను తీసుకోనున్నట్టు సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. బ్యాంకింగ్ రంగంతో పాటు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల(ఎన్‌బీఎఫ్‌సీ) మూలధన నిధులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆర్‌బీఐ కనిష్టం కంటే ఎక్కువగానే ఉన్నాయి.


Read More..

Rajnath singh: పదేళ్లలో 10 రెట్లు పెరిగిన రక్షణ ఎగుమతులు: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

Advertisement

Next Story