- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
2032 నాటికి రూ.12 వందల కోట్లకు భారత టూరిజం పరిశ్రమ
దిశ, బిజినెస్ బ్యూరో: భారత సుస్థిర టూరిజం పరిశ్రమ 2022లో రూ.215 కోట్లు($26.01 మిలియన్లు)గా ఉండగా 2032 నాటికి ఇది వార్షిక ప్రాతిపదికన 19.3 శాతం వృద్ధి రేటుతో రూ.12 వందల కోట్లకు($151.88 మిలియన్లు) చేరుకుంటుందని హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్ల సమాఖ్య తన నివేదికలో పేర్కొంది. టూరిజం పెరగడం ద్వారా దేశంలో తలసరి ఆదాయం కూడా పెరుగుతుంది. అలాగే, 'సస్టైనబిలిటీ ఇన్ టూరిజం' పేరుతో, భారత పర్యాటకం, ఆతిథ్య పరిశ్రమ 2028 నాటికి రూ.487 కోట్ల($59 బిలియన్ల)కు పైగా ఆదాయాన్ని ఆర్జించగలదని నివేదిక అంచనా వేసింది.
అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే తలసరి వినియోగ రేటు తక్కువగా ఉన్నప్పటికీ, రాబోయే సంవత్సరాల్లో గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేసే మూడవ అతిపెద్ద దేశంగా భారత్ అవతరించనుందని డేటా వెల్లడించింది. ఇటీవల హోటళ్లు, రిసార్ట్‌లు పర్యావరణ అనుకూలమైన సౌరశక్తి, గాలి ఆధారిత ఉత్పత్తులను ఉపయోగించుకుంటున్నాయి. వాతావరణ మార్పుల గురించి పెరుగుతున్న ఆందోళనల కారణంగా ప్రయాణాలు తగ్గడం వలన టూరిజం విభాగం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీనిని అత్యంత వేగంగా సరిదిద్దాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది.
ఇటీవల ప్రభుత్వం2025 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌లో పర్యాటక రంగానికి మద్దతుగా రూ.2500 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. వీటితో పర్యాటక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతోపాటు అడ్వెంచర్ టూరిజం, ఎకో-టూరిజం, బిజినెస్ టూరిజం, మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించాలని చూస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.