- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.2.96 లక్షల కోట్లకు భారత్-సింగపూర్ వాణిజ్యం
దిశ, బిజినెస్ బ్యూరో: భారత్-సింగపూర్ మధ్య 2022-23లో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం రూ.2.96 లక్షల కోట్ల($35.6 బిలియన్ల)కు చేరుకుందని, ఇది క్రితం ఏడాదితో పోలిస్తే 18.2 శాతం వృద్ధి చెందిందని భారత హైకమిషన్‌లోని సీనియర్ దౌత్యవేత్త శనివారం అన్నారు. సింగపూర్‌లో జరుగుతున్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) మూడో అంతర్జాతీయ సదస్సులో మాట్లాడిన దౌత్యవేత్త టి ప్రభాకర్, సింగపూర్, భారత్‌కు ఎనిమిదో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, 2022-23లో మొత్తం వాణిజ్యంలో ఈ దేశం వాటా 3.1 శాతంగా ఉందని తెలిపారు.
ఎగుమతుల పరంగా భారత్‌కు సింగపూర్ ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉంది. సమీక్ష కాలంలో సింగపూర్ నుండి దిగుమతులు $23.6 బిలియన్లతో 24.4 శాతం వృద్ధిని సాధించాయి. రెండు దేశాల పెట్టుబడులు కూడా సానుకూలంగా ఉన్నాయని దౌత్యవేత్త అన్నారు. సమీక్ష కాలంలో సింగపూర్ నుంచి భారత్‌కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 17.2 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని తెలిపారు. ఏప్రిల్ 2000 నుండి డిసెంబర్ 2023 వరకు సింగపూర్ నుండి దేశానికి సంచిత ఎఫ్‌డిఐ ప్రవాహాలు 155.612 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి, ఇది భారతదేశంలోకి వచ్చిన మొత్తం ఎఫ్‌డిఐలో 23 శాతం అని ఆయన చెప్పారు. సాంకేతికతలు, AI, గ్రీన్ ఎనర్జీ వంటి కొత్త రంగాల్లో రెండు దేశాల మధ్య విస్తృతమైన వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా దౌత్యవేత్త అన్నారు.