Financial Phishing: దేశీయంగా ఆరు నెలల్లో 1.35 లక్షల ఫైనాన్షియల్ ఫిషింగ్ దాడులు

by S Gopi |
Financial Phishing: దేశీయంగా ఆరు నెలల్లో 1.35 లక్షల ఫైనాన్షియల్ ఫిషింగ్ దాడులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా కంపెనీలు, వివిధ పరిశ్రమలు సైబర్ దాడులకు కేంద్రంగా మారుతున్నాయి. ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య ఆర్థిక పరమైన విషయాల్లో వివిధ సంస్థలు 1,35,173 ఫిషింగ్ దాడులను ఎదుర్కొన్నాయి. అత్యధిక సైబర్ దాడులను చూస్తున్న వాటిలో ఈ-కామర్స్, బ్యాంకింగ్, పేమెంట్ సంస్థలున్నాయి. గతేడాదితో పోలిస్తే ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉన్న ఆయా సంస్థలపై సైబర్ దాడులు 175 శాతం పెరిగాయని గ్లోబల్ కంపెనీ కాస్పర్‌స్కై నివేదిక తెలిపింది. డిజిటల్ వినియోగం పెరగడం, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ద్వారా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొవిడ్-19 మహమ్మారి ఆన్‌లైన్ బ్యాంకింగ్, డిజిటల్ ఫైనాన్స్ సేవలను వేగవంతం చేసింది. దీన్ని మోసపూరిత కార్యకలాపాలకు వాడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కాస్పర్‌స్కై ఇండియా జనరల్ మేనేజర్ జయదీప్ సింగ్ అన్నారు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల్లో జరిగడం ఆయా సంస్థలపై ఎక్కువ ప్రభావం ఉంది. ఇలాంటి ఫైనాన్షియల్ ఫిషింగ్ ద్వారా స్కామర్లు వ్యక్తిగత, విలువైన సమాచారాన్ని, ఆర్థిక ఖాతాలకు చెందిన లాగ్-ఇన్ వివరాలను దొంగలిస్తున్నారని నివేదిక పేర్కొంది.

Advertisement

Next Story