- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లింగ సమానత్వంలో రెండు స్థానాలు దిగజారిన భారత్
దిశ, బిజినెస్ బ్యూరో: లింగ సమానత్వంలో భారత్ గత ఏడాది కంటే రెండు స్థానాలు క్రిందికి దిగజారింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా, 146 దేశాల సూచికలో భారత్ 129వ స్థానానికి పడిపోయింది. గత ఏడాది 127 వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఐస్‌ల్యాండ్ తన అగ్రస్థానాన్ని నిలుపుకుంది. వరుసగా 14 ఏళ్ల నుంచి ఐస్‌ల్యాండ్ లింగ సమానత్వంలో మొదటి స్థానంలో ఉండటం గమనార్హం. దక్షిణాసియా దేశాల పరంగా చూసినట్లయితే బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్ తర్వాత భారతదేశం ఐదవ స్థానంలో ఉండగా, పాకిస్తాన్ చివరి స్థానంలో నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా, సూచికలో సూడాన్ చివరి స్థానంలో ఉండగా, పాకిస్తాన్ గత ఏడాది కంటే మూడు స్థానాలు దిగజారి 145వ స్థానానికి పడిపోయింది. అత్యల్ప స్థాయి స్త్రీ, పురుష ఆర్థిక సమానత్వంలో బంగ్లాదేశ్, సూడాన్, ఇరాన్, పాకిస్తాన్, మొరాకోలతో పాటు భారత్ కూడా ఒకటిగా ఉంది, ఈ దేశాల్లో అంచనా వేసిన ఆదాయంలో 30 శాతం కంటే తక్కువ లింగ సమానత్వాన్ని నమోదు చేశాయి. సెకండరీ విద్య చదివే స్త్రీ, పురుష విద్యార్థుల నమోదులో భారత్ అత్యుత్తమ లింగ సమానత్వాన్ని చూపింది.
రాజకీయాల్లో మహిళల సాధికారత పరంగా ప్రపంచవ్యాప్తంగా భారత్ 65వ స్థానంలో ఉంది. మంత్రి పదవుల్లో (6.9 శాతం), పార్లమెంట్‌లో (17.2 శాతం) మహిళా ప్రాతినిధ్యం తక్కువగా ఉందని నివేదిక తెలిపింది. 140 కోట్లకు పైగా జనాభాను కలిగి ఉన్న భారత్ 2024లో 64.1 శాతం లింగ వ్యత్యాసాన్ని తొలగించిందని నివేదిక తెలిపింది. గత నాలుగు సంవత్సరాలుగా భారతదేశ ఆర్థిక సమానత్వ స్కోరు పైకి ట్రెండ్ అవుతుందని ఫోరమ్ తెలిపింది.
అదే సమయంలో ప్రపంచం మొత్తం కూడా లింగ వ్యత్యాసాన్ని 68.5 శాతం తొలగించిందని, అయితే ప్రస్తుత వేగంతో పూర్తి స్థాయి లింగ సమానత్వాన్ని సాధించాలంటే 134 సంవత్సరాలు పడుతుందని, ఇది ఐదు తరాలకు సమానం అని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ పేర్కొంది. లింగ సమానత్వంలో ఐస్‌ల్యాండ్ తర్వాతి స్థానాల్లో ఫిన్‌లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్ మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.