వచ్చే పదేళ్లలో ప్రపంచ తయారీ హబ్‌గా భారత్‌!

by Vinod kumar |   ( Updated:2023-04-10 14:51:35.0  )
వచ్చే పదేళ్లలో ప్రపంచ తయారీ హబ్‌గా భారత్‌!
X

న్యూఢిల్లీ: చైనాను అధిగమించి ప్రపంచ తయారీ హబ్‌గా మారేందుకు భారత్‌కు ప్రత్యేకమైన అవకాశం ఉందని గోద్రేజ్ అండ్ బొయిస్ ఛైర్మన్ జంషీడ్ నౌరోజీ గోద్రేజ్ అన్నారు. విదేశీ కంపెనీలు స్థిరత్వాన్ని పెంపొందించేందుకు తమ తయారీ, సరఫరా వ్యవస్థలపై ఆధారపడతాయి. రాబోయే దశాబ్ద కాలంలో గ్లోబల్ మాన్యూఫాక్చరింగ్ హబ్‌గా ఎదిగేందుకు భారత్‌కు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. గత రెండున్నరేళ్లలో కరోనా, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, రష్యా ఉక్రెయి యుద్ధం వంటి పరిణామాలు వ్యాపారాలను దెబ్బతీశాయి.

దానివల్ల భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అద్భుతమైన అవకాశం లభిస్తుంది. ఇప్పటికే చాలా కంపెనీలు చైనా నుంచి తయారీఅని ఇతర ప్రాంతాలకు మార్చే పనిలో ఉన్నాయి. మరిన్ని కంపెనీలు కూడా అదే ఆలోచనలో ఉన్నాయి. కాబట్టి తయారీకి అనువైన హబ్‌గా భారత్ ఎక్కువమందికి ఆకర్షణంగా మారింది. తయారీ రంగంలో ఉండే సవాళ్లను అధిగమించేందుకు ఎదురైన, అయ్యే సమస్యలను పరిష్కరించడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని ఆయన వివరించారు.

తయారీకి అత్యంత సామర్థ్యం కలిగి ఉండాలి. దానికి తోడు వ్యాపారం ఇబ్బందుల్లేకుండా కొనసాగేందుకు సఫరాదారులు, తయారీదారుల మధ్య పరస్పర భాగస్వామ్యం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా సరఫరాలో సమస్యలు తలెత్తకూడదని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో కాకుండా గ్రామ స్థాయిలోనూ అందుకవసరమైన అవగాహన ఉండాలని నౌరోజీ పేర్కొన్నారు.

Also Read..

చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌‌పై చార్జిషీట్‌ దాఖలు చేసిన సీబీఐ

Advertisement

Next Story