Finance Ministry: దేశీయ పరిశ్రమకు హాని కలిగించని వాటిపై సుంకాలు ఎత్తేస్తాం: నిర్మలా సీతారామన్

by S Gopi |
Finance Ministry: దేశీయ పరిశ్రమకు హాని కలిగించని వాటిపై సుంకాలు ఎత్తేస్తాం: నిర్మలా సీతారామన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయంతో గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు వచ్చాయి. భారత్‌ను అతిపెద్ద దిగుమతి సుంకంగా అభివర్ణించిన నేపథ్యంలో దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. దేశీయ పరిశ్రమకు హాని కలిగించని ఉత్పత్తులపై సుంకాలను వెనక్కి తీసుకునే అవకాశాలు ఉన్నాయని మంగళవారం ఓ ప్రకటనలో చెప్పారు. ఉద్దేశపూర్వకంగా లేదా అనాలోచితంగా దేశీయ స్వంత పరిశ్రమలను, ఉత్పత్తులను దెబ్బతీయని వాటిపై సుంకాలను ఎత్తివేస్తాను. దేశీయ, విదేశీ ఉత్పత్తులను రెండింటినీ బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత తనపై ఉందని ఓ కార్యక్రమంలో మాట్లాడారు. దిగుమతులపై ఆధారపడిన వారి అవసరాలను సమతుల్యం చేస్తూ దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 2020లో డొనాల్డ్ ట్రంప్ భారత్ అధిక సుంకాలను విధించే దేశమని, 'టారిఫ్ కింగ్' అని విమర్శించారు. తాను మళ్లీ గెలిస్తే భారత్ తరహాలోనే అమెరికా కూడా పన్నులు విధిస్తుందన్నారు. ఈ క్రమంలోనే దిగుమతులపై సుంకాలను పెంచాలని, దిగుమతులను తగ్గించాలనే ఉద్దేశం భారత్‌కు లేదని, అందుకు తగిన వివరణ తమకుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed