- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
రీల్స్ చూసే వారిలో భారత్‌దే అగ్రస్థానం: మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్
దిశ, బిజినెస్ బ్యూరో: రీల్స్ చూసేవారిలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంధ్యా దేవనాథన్ అన్నారు. తాజాగా ఒక సమావేశంలో మాట్లాడిన ఆమె, భారత్ మాకు అతిపెద్ద మార్కెట్, ముఖ్యంగా రీల్స్ పరంగా ఇటీవల కాలంలో ఎక్కువ వ్యాపారం జరుగుతున్నట్లు తెలిపారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా వ్యాపార ప్రకటనలు అధికంగా పెరిగాయని, ప్రపంచవ్యాప్తంగా మెటాకు రీల్స్ చాలా ముఖ్యం, అయితే వీటికి భారత్‌లో ఎక్కువ ఆదరణ ఉందని భారత్ మాకు చాలా కీలకమైన మార్కెట్ అని సంధ్యా అన్నారు.
రీల్స్ శక్తిని గుర్తించిన వివిధ కంపెనీలు, వ్యక్తులు తమ బ్రాండ్‌లు, వ్యాపార ప్రకటనలకు వీటిని వాడుకుంటున్నారు. రీల్స్ వ్యాపార ప్రకటనల రంగంలో సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసింది, యూజర్లకు ఎంటర్‌టైన్‌మెంట్ అందించడంతో పాటు వివిధ వర్గాల వారికి వ్యాపార ప్రకటనలకు మాధ్యమంగా కూడా ఉపయోగపడుతుందని ఆమె అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా మెటాకు ప్రాధాన్యత కలిగిన మార్కెట్‌లలో భారతదేశం ఒకటిగా ఉంటుందని పేర్కొన్న ఆమె, కంపెనీ ఇక్కడి అవకాశాల గురించి చాలా సంతోషిస్తున్నదని, దేశంలో రెట్టింపు పెట్టుబడులను కొనసాగిస్తామని తెలిపారు. భారతీయ మార్కెట్ మెటాకు చాలా ముఖ్యమైన అతిపెద్ద మార్కెట్, ప్రధానంగా ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధికి మెటా కూడా తన వంతుగా తోడ్పాటు అందిస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి బాగా సిద్ధంగా ఉంది, రాబోయే సంవత్సరాల్లో 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆమె చెప్పారు.