IDBI Bank: ఐడీబీఐ బ్యాంకు 'అసెట్ వాల్యూయర్' నియామకానికి బిడ్‌ల ఆహ్వానం!

by Vinod kumar |
IDBI Bank: ఐడీబీఐ బ్యాంకు అసెట్ వాల్యూయర్ నియామకానికి బిడ్‌ల ఆహ్వానం!
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ వాటాను విక్రయించే ప్రక్రియ ఎట్టకేలకు ప్రభుత్వం ప్రారంభించింది. అసెట్ వాల్యూయర్ నియామకానికి బిడ్‌లను ఆహ్వానిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. బ్యాంకు ఆస్తులను మూల్యాంకనం చేసేందుకు, విక్రయ ప్రక్రియ ముగిసే వరకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు ఈ అసెట్ వాల్యూయర్ బాధ్యత వహిస్తారు. ఈ ప్రక్రియ కోసం బిడ్ వేసేందుకు అక్టోబర్ 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్(దీపమ్) ఈ వ్యూహాత్మక విక్రయ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వానికి 49.24 శాతం, ఎల్ఐసీకి 45.48 శాతం వాటా ఉన్నాయి. ప్రైవేటీకరణలో భాగంగా 30.48 శాతం, ఎల్ఐసీకి చెందిన 30.24 శాతం వాటాను విక్రయించనున్నారు. అలాగే, యాజమాన్య హక్కులను కూడా బదిలీ చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed