- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొనుగోలు శక్తి ఆధారిత జీడీపీ ర్యాంకింగ్స్‌లో మెరుగ్గా భారత్ స్థానం: నివేదిక
దిశ, బిజినెస్ బ్యూరో: గత కొన్నేళ్లుగా కొనుగోలు శక్తి ఆధారిత(PPP) జీడీపీ ర్యాంకింగ్స్‌లో జపాన్, జర్మనీ, యూకే వంటి దేశాల స్థానాలు పడిపోతుండగా, భారత్ మాత్రం ఈ జాబితాలో అత్యంత మెరుగ్గా ఉందని ఢిల్లీకి చెందిన సోషల్ పాలసీ రీసెర్చ్ ఫౌండేషన్ (SPRF) పరిశోధన నివేదిక పేర్కొంది. 2024 నాటికి భారత జీడీపీ(PPPలో) యూకే కంటే 3.6 రేట్లు, జపాన్ కంటే 2.1 రేట్లు, జర్మనీ కంటే 2.5 రేట్లు ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. భారత్‌తో పోలిస్తే అమెరికా, జపాన్, రష్యా, ఇతర దేశాల వాటా చాలా వరకు ఈ విభాగంలో జీడీపీ వాటా తగ్గింది. PPP అనేది రెండు దేశాల మధ్య ఒకే వస్తువు, సేవలకు ఉన్నటువంటి తేడాలను గమనించడంలో సహాయపడుతుంది.
2023 మూడవ త్రైమాసికంలో భారత వృద్ధి 8.4 శాతం పెరగడంతో 2023-24 ఆర్థిక సంవత్సరానికి దేశ ఆర్థిక వృద్ధి రేటు 7.6 శాతంగా గణాంకాల మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా మందగమనం ఉన్నప్పటి కూడా భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. తాజాగా ఆర్‌బీఐ పేర్కొన్న దాని ప్రకారం, గ్లోబల్ దేశాల కంటే ఆరోగ్యకరమైన కార్పొరేట్, బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌లు భారతదేశ వృద్ధిని ముందుకు నడిపించే అవకాశం ఉందని అంచనా వేసింది.