- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
625 బిలియన్ డాలర్లకు భారత ఫారెక్స్ నిల్వలు
దిశ, బిజినెస్ బ్యూరో: భారతదేశ విదేశీ మారక నిల్వలు(ఫారెక్స్ నిల్వలు) మార్చి 1తో ముగిసిన వారానికి 6.55 బిలియన్ డాలర్లు పెరిగి 625.626 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం పేర్కొంది. ఇంతకుముందు సమీక్ష వారంలో ఇవి 2.975 బిలియన్ డాలర్లు పెరిగి 619.072 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ప్రస్తుతం మార్చి 1తో ముగింపు వారంలో రిజర్వుల్లో ప్రధానమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 6.043 బిలియన్ డాలర్లు పెరిగి 554.231 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని డేటా చూపించింది.
అలాగే, బంగారం నిల్వలు 569 మిలియన్ డాలర్లు పెరిగి 48.417 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అదే సమయంలో ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు 17 మిలియన్ డాలర్లు తగ్గి 18.18 బిలియన్ డాలర్లకు చేరుకుందని అపెక్స్ బ్యాంకు పేర్కొంది. రిపోర్టింగ్ వారంలో IMFలో భారత రిజర్వ్ స్థానం 41 మిలియన్ డాలర్లు తగ్గి 4.798 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గతంలో 2021 అక్టోబర్‌లో దేశ ఫారెక్స్ నిల్వలు ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 645 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.