- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫిబ్రవరిలో రూ.1.55 లక్షల కోట్లకు పెరిగిన వాణిజ్య లోటు
దిశ, బిజినెస్ బ్యూరో: ఎర్ర సముద్రంలో అలజడులు, ఉక్రెయిన్ యుద్ధం, పాశ్చాత్య దేశాల్లో అనిశ్చితి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా గత 11 నెలల్లో వస్తువులు, సేవల పరంగా భారత్ అత్యధిక ఎగుమతి వృద్ధిని సాధించిందని వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్తవాల్ తెలిపారు. మార్చి 15న వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశ సరుకుల వాణిజ్య లోటు జనవరిలో రూ.1.44 లక్షల కోట్ల($17.49 బిలియన్ల) నుంచి ఫిబ్రవరిలో రూ.1.55 లక్షల కోట్లకు ($18.71 బిలియన్ల) చేరుకుంది. 2023 ఫిబ్రవరిలో వాణిజ్య లోటు రూ.1.37 లక్షల కోట్లు($16.57 బిలియన్లు)గా ఉంది.
2024 ఫిబ్రవరిలో వాణిజ్య లోటు పెరిగినప్పటికీ, ఎగుమతులు 11.9 శాతం పెరిగి రూ.3.43 లక్షల కోట్ల($41.40 బిలియన్ల)కు చేరాయి, అయితే దిగుమతులు కూడా ఏడాది ప్రాతిపదికన 12.2 శాతం పెరిగి రూ.4.98 లక్షల కోట్ల($60.11 బిలియన్ల)కు చేరుకున్నాయని డేటా చూపించింది. మొత్తంగా 2023 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి కాలానికి మధ్య భారతదేశ వాణిజ్య లోటు $225.20 బిలియన్లకు చేరుకుంది. ఇది 2022-23 మొదటి 11 నెలల్లో $245.94 బిలియన్లుగా నమోదైంది.