2025 కల్లా ఐదు ట్రిలియన్ డాలర్లకు భారత్: కేంద్ర మంత్రి

by S Gopi |
2025 కల్లా ఐదు ట్రిలియన్ డాలర్లకు భారత్: కేంద్ర మంత్రి
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆర్థికవ్యవస్థ 2024-25 ముగిసే నాటికి 5 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరుకుంటుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ పూరి అన్నారు. అలాగే, ఈ దశాబ్దం చివరి నాటికి 10 ట్రిలియన్ డాలర్లతో రెట్టింపు వృద్ధిని సాధించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్ 3.7 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా ఉంది. మంగళవారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర మంత్రి, 'గత కొద్ది రోజులుగా మనం 2028 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారతామని వింటున్నాను. అప్పటివరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. రాముడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. మరో 1-2 ఏళ్లలో నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగానే కాకుండా మరింత మెరుగైన వృద్ధిని చూడగలమని' హర్‌దీప్ పూరి తెలిపారు. డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆటోమొబైల్ మార్కెట్, ఎనర్జీ లేదా బయో ఫ్యూయెల్ రంగాల్లో భారత్ ప్రపంచ శక్తిగా ఎదగనుందని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed