- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
India-ASEAN: నవంబర్‌లో భారత్- ఆసియాన్ ఆరో రౌండ్ చర్చలు
దిశ, బిజినెస్ బ్యూరో: భారత్- ఆసియాన్ దేశాల వాణిజ్యానికి సంబంధించి ఆరో రౌండ్ చర్చలు నవంబర్ నెలలో జరుగుతాయని బుధవారం వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశం ఢిల్లీలో జరగనుంది. అంతకుముందు ఇండోనేషియాలోని జకార్తాలో ఆగస్టులో ఐదవసారి సమావేశమైన జాయింట్ కమిటీ మొత్తం ఎనిమిది సబ్‌కమిటీల పురోగతిపై చర్చించింది. ఆ తర్వాత ఈ చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి చర్చల ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఆసియాన్(ASEAN(అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్))లో 10 దేశాలు ఉన్నాయి. అవి బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం.
ఈ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై AITIGA (ఆసియాన్-ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ ఒప్పందం) చర్చలు మే 2023లో ప్రారంభమయ్యాయి. భారత్- ఆసియాన్ మధ్య చర్చలను 2025లో ముగించాలని నిర్ణయించారు. భారత్ ఆసియాన్ కూటమితో చర్చిస్తూనే అటు ఆస్ట్రేలియాతో కూడా స్వేచ్చా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతోంది. ఇప్పటికే రెండు దేశాల మధ్య తొమ్మిది రౌండ్ల చర్చలు ముగియగా, 10వ రౌండ్ చర్చలు వచ్చే వారం నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈయూతో కూడా సెప్టెంబరులో న్యూఢిల్లీలో తొమ్మిదో రౌండ్ చర్చలు జరపాలని భారత్ భావిస్తుంది.