- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలకు పెరుగుతున్న గిరాకీ
దిశ, బిజినెస్ బ్యూరో: పెరుగుతున్న టెక్నాలజీకి తోడు పర్యావరణ రక్షణ నేపథ్యంలో సాంప్రదాయ ఇంధన వాహనాల నుంచి ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలకు గిరాకీ వేగంగా పెరుగుతోందని ప్రముఖ విశ్లేషణా సంస్థ కేర్ ఎడ్జ్ రేటింగ్స్ తెలిపింది. గడిచిన మూడేళ్ల కాలంలో మొత్తం వాహనాల అమ్మకాల్లో సాంప్రదాయ ఇంధన వాహనాల వాటా క్రమంగా తగ్గుతోంది. 2020లో 86 శాతంగా ఉన్న పెట్రోల్ వాహనాలు 2023 నాటికి 76 శాతానికి తగ్గాయి. అలాగే, డీజిల్ వాహనాలు 2020లో 12 శాతం నుంచి 2023లో 11 శాతానికి క్షీణించాయి. ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలు ఇదే సమయంలో 400 శాతం కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేశాయి. ప్రస్తుత ఈవీలు, సీఎన్‌జీ వాహనాల జీవితకాలం తక్కువ. ప్రభుత్వం ప్రోత్సాహకాలు, బ్యాటరీ ఖర్చులు తగ్గించడం, ఇంధన ఖర్చులు, ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల ఈవీలకు గిరాకీ భారీగా పుంజుకుంది. కేంద్ర ప్రభుత్వం సైతం 2030 నాటికి మొత్తం వాహనాల అమ్మకాల్లో 30 శాతం ఈవీలు ఉండాలని లక్ష్యంగా ఉంది. దీనికోసం ఛార్జింగ్ స్టేషన్ల వృద్ధి, సబ్సిడీ, గ్రాంట్లు వంటి పథకాలను ప్రారంభించింది. మొత్తంగా భారత వాహన రంగం సాంప్రదాయ ఇంధనం, ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలకు మారే దశలో ఉంది. ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లు భవిష్యత్తులో పరిష్కరించబడతాయి. భవిష్యత్తు ప్రభుత్వ విధానాలు, టెక్నాలజీ పురోగతి, వినియోగదారుల ప్రాధాన్యత వంటి అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని కేర్ ఎడ్జ్ అసోసియేట్ డైరెక్టర్ ఆర్తీ రాయ్ పేర్కొన్నారు.