IPL సమయంలో వీటికి భారీ డిమాండ్

by Harish |
IPL సమయంలో వీటికి భారీ డిమాండ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఐపీఎల్ ప్రారంభ నేపథ్యంలో మ్యాచ్‌లను చూడటానికి వచ్చే సెలబ్రిటీలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఫ్యాన్స్‌తో హోటళ్లు, రెస్టారెంట్లు గణనీయమైన బుకింగ్‌లను సాధిస్తాయని ఒక నివేదిక పేర్కొంది. ముఖ్యంగా హోలీకి ముందు వారంలో వరుసగా సెలవులు ఉన్న నేపథ్యంలో ప్రారంభ డిమాండ్ ఎక్కువ ఉంటుందని నివేదిక అంచనా వేసింది. వీక్షకులను ఆకట్టుకోడానికి ఇప్పటికే చాలా రెస్టారెంట్లు, హోటళ్లు ప్రత్యేక ప్యాకేజ్‌లను తీసుకొస్తున్నాయి. విలాసవంతమైన బసలు, భోజనాలతో ఐపీఎల్‌ అనుభవాన్ని కోరుకునే వారికి ఆకర్షణీయమైన ధరలను అందించడానికి పలు యజమాన్యాలు సిద్ధంగా ఉన్నాయి.

ముంబైలోని ఇంటర్‌కాంటినెంటల్ ఐపీఎల్‌ అభిమానుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బస, ప్రత్యేక మెనును అందిస్తోంది. ఇంప్రెసారియో ఎంటర్‌టైన్‌మెంట్ & హాస్పిటాలిటీ ప్రై.లి గత ఏడాది ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ సమయంలో ఆర్డర్ వాల్యూమ్‌లో 20-30 శాతం పెరుగుదలను చూడగా, ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో కూడా అదే విధమైన వృద్ధిని అంచనా వేస్తున్నట్టు పేర్కొంది. అదే సమయంలో జోమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ కంపెనీలు కూడా తమ వ్యాపారంలో 30-35 శాతం పెరుగుదలను అంచనా వేస్తున్నాయి.

Advertisement

Next Story