Income Tax: ఆదాయపు పన్ను అధికారులకు ప్రత్యేక అధికారాలు

by S Gopi |
Income Tax: ఆదాయపు పన్ను అధికారులకు ప్రత్యేక అధికారాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ కొత్తగా తీసుకొచ్చిన ఆదాయపు పన్ను బిల్లులో సంబంధించి ఐటీ విభాగం అధికారులకు మరిన్ని ప్రత్యేక అధికారాలను పొందుపరిచింది. దీని ప్రకారం, ఆదాయపు పన్ను అధికారులు ఇకపై పన్ను చెల్లింపుదారులకు సంబంధించి సోషల్ మీడియా అకౌంట్లతో పాటు ఈ-మెయిల్, ఆన్‌లైన్ పెట్టుబడులు, ట్రేడింగ్ అకౌంట్ గురించిన వివరాలను సైతం అడిగే అధికారాన్ని కలిగి ఉంటారు. పన్నులను ఎగవేయడం, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండటం, లెక్కలో లేని బంగారం, డబ్బు ఉన్నట్టు అధికారులు గుర్తిస్తే సంబంధిత వ్యక్తుల అకౌంట్లను తనిఖీ చేసే అవకాశం ఉంటుంది. ఈ మేరకు కొత్త బిల్లులో నిబంధనలను ప్రభుత్వం తీసుకొచ్చింది. డిజిటల్ వినియోగం పెరిగిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా పన్నుల ప్రక్రియలో ఆర్థిక మోసం, అప్రకటిత ఆస్తులు, పన్ను ఎగవేతలను నిరోధించడమే ఈ మార్పు ఉద్దేశమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న 1961 నాటి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, ఆదాయపు పన్ను అధికారులకు కొన్ని పరిమితులున్నాయి. ఎవరైనా ఆదాయపు పన్ను ఎగవేతకు పాల్పడితే సోదాలు, తనిఖీలు చేపట్టవచ్చు. పత్రాలు, ఆర్థిక వివరాల కోసం లాకర్లను పగలగొట్టే అధికారం ఉంటుంది. దీనికి అదనంగానే కొత్త బిల్లులో వ్యక్తుల డిజిటల్ పరికరాలను కూడా తనిఖీ చేసే వీలుంటుంది.

Next Story

Most Viewed