IT Department: 15 రోజుల్లో 4 కోట్ల ఐటీఆర్‌లను ప్రాసెస్ చేసిన ఆదాయపు పన్ను శాఖ

by S Gopi |   ( Updated:2024-08-22 01:27:06.0  )
IT Department: 15 రోజుల్లో 4 కోట్ల ఐటీఆర్‌లను ప్రాసెస్ చేసిన ఆదాయపు పన్ను శాఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: 2024-25 అసెస్‌మెంట్ ఏడాదికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ 15 రోజుల్లో దాదాపు 4 కోట్ల ఐటీఆర్‌లను ప్రాసెస్ చేసిందని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తెలిపారు. బుధవారం జరిగిన 165వ ఆదాయపు పన్ను దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఇదే ఏడాదికి జూలై 31 వరకు మొత్తం 7.28 కోట్ల ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలయ్యాయి. పన్ను శాఖ ఇప్పటికే 4.98 కోట్ల ఐటీఆర్‌లను ప్రాసెస్ చేసింది. దీనికి సంబంధించి పన్ను చెల్లింపుదారులకు సమాచారం అందించింది. ఇందులో 3.92 కోట్ల ఐటీఆర్‌లను 15 రోజుల్లోనే ప్రాసెస్ చేశారు. ప్రధానంగా ఆదాయపు పన్ను శాఖ డిజిటలైజేషన్‌లో పురోగతి సాధించింది. దానివల్లనే ఇది సాధ్యమైందని ఆయన తెలిపారు. గడిచిన దశాబ్ద కాలంలో ప్రత్యక్ష పన్నుల ఆదాయం రూ. 5.59 లక్షల కోట్ల నుంచి రూ. 20 లక్షల కోట్లకు పెరిగిందని ఆయన వెల్లడించారు. అలాగే, ఈ సమయంలోనే పన్ను-జీడీపీ నిష్పత్తి 5.6 శాతం నుంచి 6 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు.

Advertisement

Next Story