- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సముద్ర భద్రతను పెంచనున్న IMEC: పీయూష్ గోయల్
దిశ, బిజినెస్ బ్యూరో: ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్(IMEC) సముద్ర భద్రతను బలోపేతం చేస్తుందని అలాగే, వాణిజ్యం కోసం కొన్ని మార్గాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సెప్టెంబర్ 6న CII ఇండియా మెడిటరేనియన్ బిజినెస్ కాంక్లేవ్ 2024లో గోయల్ మాట్లాడుతూ, మధ్యధరా దేశాలతో జరుగుతున్న వాణిజ్యం మరింత పెరగాల్సి ఉంది. మేక్-ఇన్-ఇండియా కార్యక్రమాలు, డిజిటలైజేషన్, ఇన్నోవేషన్, టూరిజం విషయంలో మధ్యధరా దేశాలతో సహకారాన్ని పెంపొందించుకోవాలి, ఎందుకంటే ఈ విభాగాలు భారతదేశ వృద్ధికి కీలకమైనవని అన్నారు. ఈ కారిడార్ ద్వారా యూరప్, ఆసియా దేశాల మధ్య సరుకుల రవాణా వేగవంతమవుతుందని గోయల్ శుక్రవారం తెలిపారు.
IMEC ద్వారా మధ్యధరా ప్రాంతాలకు పెద్ద ఎత్తున వస్తువులను ఎగుమతి చేస్తున్నాం, పునరుత్పాదక శక్తి, తయారీ, ఫార్మా, వ్యవసాయ పరికరాల వాణిజ్యం ఈ ప్రాంతాల మధ్య కొనసాగుతుందని గోయల్ అన్నారు. 2013లో ప్రారంభించిన చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా IMECని ప్రారంభించేందుకు భారతదేశం G20 మిత్రదేశాలతో గత సెప్టెంబర్‌లో చేతులు కలిపింది. న్యూఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్‌లో భాగంగా, US, UAE, సౌదీ అరేబియా, యూరోపియన్ యూనియన్ (EU), ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీలతో భారత్ ఆర్థిక కారిడార్ ఒప్పందాన్ని చేసుకుంది. దక్షిణాసియా, అరేబియా గల్ఫ్, ఐరోపా మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడం, ఆర్థిక సమగ్రతను పెంపొందించడం దీని లక్ష్యం.