Disinvestment: ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు త్వరలో ఆర్‌బీఐ క్లియరెన్స్

by S Gopi |
Disinvestment: ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు త్వరలో ఆర్‌బీఐ క్లియరెన్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్రం వేగవంతం చేస్తోంది. తాజాగా ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి హోం మంత్రిత్వ శాఖ నుంచి అవసరమైన భద్రతా క్లియరెన్స్ అందించట్టు ఓ అధికారి తెలిపారు. త్వరలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) నుంచి క్లియరెన్స్ అనుమతులు రావొచ్చని అధికారి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతేడాది జనవరిలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్(దీపమ్) బ్యాంకులో వాటా కొనుగోలు సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ)లను స్వీకరించింది. దీని తర్వాత బిడ్డర్లు రెండు సెట్ల క్లియరెన్స్ పొందాల్సి ఉంటుంది. ఒకటి హోం మంత్రిత్వ శాఖ నుంచి, మరొకటి ఆర్‌బీఅ నుంచి ఫిట్ అండ్ ప్రాపర్ క్లియరెన్స్ తీసుకోవాలి. ఇందులో తాజాగా భద్రతా క్లియరెన్స్ ప్రక్రియ పూర్తవగా, ఆర్‌బీఐ నుంచి అవసరమైన అనుమతులు త్వరలో వస్తాయని అధికారులు వెల్లడించారు. కాగా, ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీ, ప్రభుత్వానికి కలిపి 94.72 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఎల్ఐసీతో కలిసి దాదాపు 61 శాతం వాటాను విక్రయిస్తోంది. అందులో ప్రభుత్వానికి చెందిన 30.48 శాతం, ఎల్ఐసీకి చెందిన 30.24 శాతం వాటా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్, అసెట్ మానిటైజేషన్ ద్వారా రూ.50,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం బడ్జెట్‌లో నిర్ణయించింది.

Advertisement

Next Story

Most Viewed