Hyundai India Q2 Results: రెండో త్రైమాసికంలో 16 శాతం తగ్గిన హ్యుండాయ్ మోటార్ ఇండియా నికర లాభం..!

by Maddikunta Saikiran |
Hyundai India Q2 Results: రెండో త్రైమాసికంలో 16 శాతం తగ్గిన హ్యుండాయ్ మోటార్ ఇండియా నికర లాభం..!
X

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ కొరియా(South Korea)కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్స్(Hyundai Motors) అనుబంధ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా(Hyundai Motor India) సెప్టెంబర్(September)తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను మంగళవారం వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక(Q2FY25) ఫలితాల్లో ఆ సంస్థ రూ.1,375 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. కాగా గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ. 1,628 కోట్ల పోలిస్తే ఈ సారి 16 శాతం లాభాలు క్షీణించాయని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో పేర్కొంది. ఇక ఈ త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం 7.5 శాతం క్షీణించి రూ. 18,659 కోట్ల నుంచి రూ. 17,260 కోట్లకు పరిమితమైనాట్లు తెలిపింది. కాగా జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం 1,91,939 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను హ్యుండాయ్ మోటార్ విక్రయించింది. ఇందులో దేశీయ అమ్మకాలు 1,49,639 యూనిట్లు ఉండగా, విదేశీ అమ్మకాలు 42,300 యూనిట్లుగా ఉన్నాయి. కాగా త్రైమాసిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఎన్ఎస్ఈ(NSE)లో హ్యుండాయ్ మోటార్ షేర్ వాల్యూ 0.11 శాతం తగ్గి రూ. 1,820 వద్ద స్థిరపడింది.

Advertisement

Next Story