- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'వెర్నా-2023' వెర్షన్‌ను విడుదల చేసిన హ్యూండాయ్ మోటార్ ఇండియా!
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యూండాయ్ మోటార్ ఇండియా మంగళవారం తన మిడ్-సైజ్ సెడాన్ కారు వెర్నా కొత్త వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దీని ధరను రూ. 10.89 లక్షల నుంచి రూ. 17.37 లక్షల(ఎక్స్‌షోరూమ్) మధ్య నిర్ణయించామని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే వెర్నా-2023 వెర్షన్ కోసం రూ. 25 వేలతో బుకింగ్‌లను స్వీకరిస్తున్నామని, 8 వేలకు పైగా బుకింగ్స్ వచ్చాయని కంపెనీ తెలిపింది. త్వరలో డెలివరీలను ప్రారంభిస్తామని పేర్కొంది.
మునుపటి వెర్షన్ కంటే అధునాతన డిజైన్, పవర్‌ట్రెయిన్, ఫీచర్ల పరంగా అప్‌డేట్ చేశామని, కొత్త మోడల్‌లో కొన్ని సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయని వివరించింది. పరిశ్రమ వర్గాల ప్రకారం, ప్రస్తుతం సెడాన్ విభాగంలో మార్కెట్లో ఉన్న హోండా సిటీ, స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ వర్చ్యూస్, మారుతీ సుజుకి సియస్ మోడళ్లకు వెర్నా-2023 గట్టి పోటీనివ్వగలదని తెలుస్తోంది.
6-జనరేషన్ వెర్నా 1.5 లీటర్ పెట్రోల్ వేరియంట్ రూ. 10.89-16.19 లక్షల మధ్య, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్ రూ. 14.83-17.37 లక్షల మధ్య ఉంది. సిల్వర్, రెడ్, నైట్, గ్రే, బ్లాక్, వైట్, బ్రౌన్ వంటి మొత్తం ఏడు రంగుల్లో ఈ మోడల్ అందుబాటులో ఉంది.
డిజైన్ పరంగా కపెనీ ఫ్రంట్ గ్రిల్‌తో పాటు డ్యుయెల్ టోన్ అలాయ్ వీల్స్, ఎల్ఈడీ హెడ్‌లాంప్ వంటి మార్పులు ఉన్నాయని, ఈ కారు లీటర్‌కు 18.6 నుంచి 20.6 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని హ్యూండాయ్ మోటార్స్ ఇండియా పేర్కొంది.