Hyundai: 473 కి.మీ రేంజ్‌తో క్రెటా ఈవీ మోడల్ విడుదల చేసిన హ్యూండాయ్

by S Gopi |
Hyundai: 473 కి.మీ రేంజ్‌తో క్రెటా ఈవీ మోడల్ విడుదల చేసిన హ్యూండాయ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యూండాయ్ ఇండియా తన ఎస్‌యూవీ మోడల్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను శుక్రవారం విడుదల చేసింది. 2025 ఏడాదికి సంబంధించి జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ కారును కంపెనీ లాంచ్ చేసింది. రూ. 17.99 లక్షల ప్రారంభ ధరతో లభించే ఈ కారు 42 కిలోవాట్ అవర్ బ్యాటరీతో ప్రీమియం వేరియంట్ రూ. 20 లక్షల వరకు ఉంటుంది. 51.4 కిలోవాట్ అవర్ వేరియంట్ రూ. 21.50 లక్షల నుంచి టాప్-ఎండ్ ఎక్స్‌లెన్స్ వేరియంట్ రూ. 23.50 లక్షలతో లభిస్తుంది. సాంప్రదాయ ఇంధన మోడల్ కంటే ఈవీ క్రెటా ఈవీ పవర్‌ట్రేయిన్‌కు అనుగుణంగా బ్యాటరీ ప్యాక్ కోసం ఎక్కువ కేబిన్ ఫ్లోర్ కలిగి ఉంటుంది. రెండు బ్యాటరీ వెర్షన్‌లతో లభించే ఈ కారు 42 కిలోవాట్ అవర్‌తో 390 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 51.4 కిలోవాట్ అవర్ లాంగ్ రేంజ్ బ్యాటరీతో 473 కిలోమీటర్లు వెళ్తుంది. గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్లగలిగే క్రెటా ఈవీ కేవలం 7.9 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. హ్యూండాయ్ ఇండియా బ్యాటరీపై 8 ఏళ్లు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వారెంటీని, వాహనంపై 3 ఏళ్ల సాధారణ వారెంటీ అందిస్తుంది.

Next Story

Most Viewed