- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- వీడియోలు
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
గ్రామీణ ప్రాంతాల్లో మరింత విస్తరించే లక్ష్యంలో హ్యూండాయ్ మోటార్!
న్యూఢిల్లీ: దేశీయ రెండో అతిపెద్ద వాహన తయారీ సంస్థ హ్యూండాయ్ మోటార్ ఇండియా భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. గత కొంతకాలంగా ఎస్‌యూవీ, ఫీచర్-రిచ్ మోడళ్లకు పెరుగుతున్న గిరాకీని బట్టి గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించనున్నామని కంపెనీ సీఈఓ తరుణ్ గార్గ్ అన్నారు. దీనికోసం హ్యూండాయ్ చిన్న పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని విక్రయ కేంద్రాలు, మొబైల్ సర్వీస్ వ్యాన్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ఉనికిని విస్తరించాలని లక్ష్యంగా ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లో కంపెనీ ఇప్పటికే 600 విక్రయ కేంద్రాలను కలిగి ఉంది. ఆయా ప్రాంతాల్లో 5 వేల మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో హ్యూండాయ్ గతేడాది లక్ష యూనిట్ల మార్కును కూడా సాధించింది. ప్రస్తుతానికి తమ అమ్మకాల్లో దాదాపు 18 శాతం వాటా గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తున్నాయి. గతేడాది మొదటిసారిగా లక్ష రిటైల్ అమ్మకాలను సాధించాం.
ప్రస్తుతం గ్రామీణా ప్రాంతాల్లో 100 వరకు మొబైల్ సర్వీస్ వ్యాన్లు ఏర్పాటు చేశామని తరుణ్ గార్గ్ అన్నారు. గతంలో గ్రామీణ మార్కెట్లలో చిన్న కార్ల వినియోగం ఎక్కువగా ఉండేది, ఇప్పుడు క్రెటా, వెన్యూ వంటి ఎస్‌యూవీల డిమాండ్ అత్యధికంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.