- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
New Ration Cards: మీకు కొత్త రేషన్ కార్డు రాలేదా? డోంట్ వర్రీ.. వెంటనే ఇలా చేయండి.
![New Ration Cards: మీకు కొత్త రేషన్ కార్డు రాలేదా? డోంట్ వర్రీ.. వెంటనే ఇలా చేయండి. New Ration Cards: మీకు కొత్త రేషన్ కార్డు రాలేదా? డోంట్ వర్రీ.. వెంటనే ఇలా చేయండి.](https://www.dishadaily.com/h-upload/2025/01/28/415748-jpeg-optimizernew-ration-cards-1-1.webp)
దిశ, వెబ్‌డెస్క్: New Ration Cards: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 26వ తేదీ నుంచి అట్టహాసంగా ప్రారంభించిన నాలుగు పథకాల్లో ఒకటి కొత్త రేషన్ కార్డులు. ఈ రేషన్ కార్డులు(New Ration Cards) పొందే లబ్దిదారుల జాబితాను ప్రభుత్వ గ్రామసభల్లో చూపించింది. అయితే జాబితాలో తమ పేరు ఉందని సంతోషపడిన వారు కొంతమంది అయితే..తమ పేరు రాలేదంటూ ఆందోళన చెందుతున్నవారు ఎంతో మంది ఉన్నారు. తమకు రేషన్ కార్డు ఎందుకు ఇవ్వాలేదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమకు రేషన్ కార్డు వస్తుందో..రాదో అనే ఆందోళన వారిలో నెలకొంది. అయితే రేషన్ కార్డు రానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్త రేషన్ కార్డుల(New Ration Cards) కోసం ప్రభుత్వం ప్రజాపాలనలో దరఖాస్తులను సేకరించగా..కొంతమంది ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకున్నారు. అలాంటి వారికి రోజువారీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఎవరికైనా రేషన్ కార్డు రానట్లయితే..వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారం రోజుల్లో రేషన్ కార్డుల పంపిణీ(Distribution of ration cards) పూర్తి చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అప్పటికి రాలేదనుకుంటే అప్పుడు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
కొత్త రేషన్ కార్డుల(New Ration Cards) జారీ అనేది నిరంతర ప్రక్రియ అని సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ఇదివరకే స్పష్టం చేశారు. 40లక్షల మందికి ప్రయోజనం చేకూరే విధంగా కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని తెలిపారు. అందువల్ల వారం రోజులైనా కొత్త రేషన్ కార్డు రానివారు..ఆ తర్వాత మాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎందుకంటే ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మీకు తొందరగా కొత్త రేషన్ కార్డు(New Ration Cards) వచ్చినట్లయితే ఆ బియ్యం పొందడానికి వీలుంటుంది.
కొత్త రేషన్ కార్డు పొందడానికి మీరు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. తెలంగాణలో శాశ్వత నివాసం ఉండాలి. ఇదివరకే రేషన్ కార్డు ఉంటే కొత్త రేషన్ కార్డు ఇవ్వరు. ఉన్న రేషన్ కార్డులోనే మార్పులు చేయించుకుంటే కొత్తది ఇస్తారు. కొత్తగా పెళ్లి చేసుకున్నవారు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన పత్రాలు. ఆధార్‌తో లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు, పాస్ పోర్టు సైజు ఫొటో, ఇంటి చిరునామా, ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఫామ్ ను ప్రజాపాలనలో పొందవచ్చు.మండల కార్యాలయాల్లోనూ పొందవచ్చు. లేదంటే మీ సేవాకు వెళ్లి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
మీ రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోవాలంటే ముందుగా మీరు ముందుగా https://epds.telangana.gov.in సైట్లోకి వెళ్లి అక్కడ FSC అని కనిపిస్తుది. దానిపై క్లిక్ చేయాలి. అక్కడ మీకు FSC ఆహార భద్రత కార్డు కోసం FSC దరఖాస్తు కోసం అనే 2 ఆప్షన్లు కనిపిస్తాయి. మీరు FSC ఆహార భద్రత కార్డు కోసం క్లిక్ చేయండి. అక్నాలడ్జ్ మెంట్ రసీదులో ఉన్న నెంబర్, పాత రేషన్ కార్డు నెంబర్, జిల్లా పేరు వంటి వివరాలు ఇచ్చినట్లయితే..మీ కార్డు స్టేటస్ అక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీకు వివరాలు తేలియకుంటే..గ్రామ, మండల ఆఫీసులకు వెళ్లి అక్కడ అధికారులను అడిగి సమాచారం తెలుసుకోండి.