Bank holidays : ఆగస్టు నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులంటే?

by Jakkula Samataha |   ( Updated:2024-07-27 10:34:47.0  )
Bank holidays : ఆగస్టు నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులంటే?
X

దిశ, ఫీచర్స్ : ఖాతాదారులకు బిగ్ అలర్ట్. ప్రస్తుతం అంతా డిజిటల్ అయిపోయినా, కొన్ని రకాల పనుల కోసం ఖాతాదారులు తప్పకుండా బ్యాంకుకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో వారి ముఖ్యమైన పనులను త్వరగా చేసుకోవాలంటే బ్యాంకు సెలవుల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. లేకపోతే రేపు చూద్దాంలే అని తమ పని వాయిదా వేసుకోవడం వలన చివరకు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. కాగా, వారి కోసమే ఈ సమాచారం. ఆగస్టు నెలలో జాతీయ, ప్రైవేట్ బ్యాంకులు వారి వారి ప్రాంతీయ పండుగలను బట్టి 13 రోజులు సెలవులు ఉండనున్నాయి. అవి ఎప్పుడెప్పుడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఆగస్టు 3 : కేర్ పూజ కారణంగా అగర్తలో బ్యాంకులు బంద్

ఆగస్టు 4 : ఆదివారం

ఆగస్టు 8 : టేన్ డాగ్ ల్హో రమ్ సందర్భంగా గాంగ్‌టక్ ప్రాంతంలో బ్యాంకులకు సెలవు

ఆగస్టు 10 : రెండో శనివారం

ఆగస్టు 11 : ఆదివారం

ఆగస్టు 15 : స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు

ఆగస్టు 18 : ఆదివారం

ఆగస్టు 19 రక్షాబంధన్.. ఉత్తరాఖండ్, డామన్ అండ్ డయ్యూ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, గుజరాత్, చండీగఢ్, ఉత్తర ప్రదేశ్‌లో బ్యాంకులకు సెలవులు

ఆగస్టు 20 : శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులు బంద్

ఆగస్టు 24 : నాలుగో శనివారం

ఆగస్టు 25 : ఆదివారం

ఆగస్టు 26 : శ్రీకృష్ణ జన్మాష్టమి

Advertisement

Next Story

Most Viewed